ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసీ పలు రకాల స్కీమ్ లను అందిస్తున్న విషయం తెలిసిందే..ప్రతి పథకం కూడా జనాలకు మంచి బెనిఫిట్స్ ను ఇస్తున్నాయి.మనం ఎంచుకునే పాలసి ఆధారంగా మనకు లభించే ప్రయోజనాలు కూడా మారుతుంటాయి.ఎల్‌ఐసీ మనీ బ్యాక్, పెన్షన్ స్కీమ్స్, చిల్ట్రన్స్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్ వంటి పలు రకాల పాలసీలను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో మీరు మీకు నచ్చిన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అయితే మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పాలసీ ఎంపిక అనేది జరగాలి. అందుకే పాలసీ తీసుకునే సమయంలో ఒకటిని రెండు సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది.
మెచ్యూరిటీ మొత్తంలో ఎటువంటి టాక్స్ కూడా ఉండదు.. ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీ తీసుకుంటే.. అందులో రోజుకు రూ. 125 పొదుపుతో మెచ్యురిటీ సమయానికి రూ. 27 నుంచి 30 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీని 25 ఏళ్ల వరకు టెన్యూర్‌తో తీసుకోవచ్చు. కనీసం పాలసీ టర్మ్ 13 ఏళ్లు. అలాగే కనీసం రూ. లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఉదాహరణకు రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే.. నెలకు రూ. 3800 వరకు ప్రీమియం పడుతుంది.
30 ఏళ్ల వయసులో ఈ పాలసీ తీసుకుంటే ఈ ప్రీమియం పడుతుంది. అంటే మీరు రోజుకు రూ. 125 పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో 27 లక్షలకు పైగా మన చేతికి వస్తాయి.ఆధార్ కార్డ్, ఇన్‌కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి తీసుకెలితే పాలసీ తీసుకోవచ్చు. ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లి పాలసీ పొందొచ్చు..లేదా ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా పాలసీని తీసుకోవచ్చు..పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సి పని లేదు.