చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి జీవితఖైదు

-

ఇండస్ట్రియలిస్ట్ చిగురుపాటి జయరాం హత్య కేసులో  నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్‌రెడ్డికి జీవితఖైదు విధిస్తూ నాంపల్లి తీర్పు చెప్పింది.  ఇదే కేసులో ఏసీపీ మల్లారెడ్డి, ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. అప్పట్లో కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

అందులో ముఖ్యంగా.. 2019 జనవరి 31న పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. దోషులు యత్నించినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.  తర్వాత జయరాం మృతదేహాన్ని.. తన స్నేహితులతో కలిసి రాకేశ్‌ రెడ్డి.. కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఉంచారు.

డబ్బు వ్యవహారమే జయరాం హత్యకు ముఖ్య కారణమని పోలీసులు విచారణ చేపట్టి.. 2019 మే నెలలోనే నేరాభియోగపత్రం దాఖలు చేశారు. ఈ అభియోగాలపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు.. నేడు రాకేశ్‌ రెడ్డిని దోషిగా తేల్చింది. మిగతా వారి ప్రమేయంపై తగిన ఆధారాలు లేనందున 11 మందిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version