మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం సభ వాయిదా పడగా.. తిరిగి శనివారం సభ ప్రారంభం అయ్యింది. నేడు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. విపక్ష నేత హరీశ్ రావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం కల్పించారు.
సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ముందుగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటును ఎత్తి వేయాలని కోరారు.తమ సభ్యుడు సభలో అమర్యాదగా గానీ,ఏకవచనంతో గానీ స్పీకర్‌ను సంబోధించలేదన్నారు.తమకు స్పీకర్ పట్ల అపారమైన గౌరవం ఉందని..ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు.సస్పెన్షన్‌కు ముందు జగదీశ్ రెడ్డికి మైక్ ఇస్తే చెప్పుకునే అవకాశం ఉండేదన్నారు. సభా సంప్రాదాయాలు పాటించాలని తమ నాయకుడు కేసీఆర్ నిత్యం చెబుతుంటారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.