ఇటీవల లైగర్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న అనన్య పాండే గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా దేవాలయాలను సందర్శిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రానికి ఉత్తమ మహిళ అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఖాళీ పీలీ, గేహ్రాయాన్, లైగర్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది.
ఇక అనన్య పాండే తల్లి క్యాస్టింగ్ డిజైనర్. 2017 వరకు ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు పూర్తి చేసిన ఈమె 2017 లో ప్యారిస్ లో జరిగిన వానిటీ ఫెయిర్ యొక్క లే బాల్ డస్ డెబ్యూ టాంటేస్ ఈవెంట్ లో కూడా పాల్గొనింది ఇకపోతే అనన్య పాండే షేర్ చేసుకున్న ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.