ఓటీటీలోకి ‘లైగర్‌’ .. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోందంటే..?

-

భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా సరే మరోసారి ‘లైగర్’ చూడాలకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వీరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ‘లైగర్’ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఈ విషయమై ట్రెండ్‌ అవుతున్నా, అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్‌ కానీ, లేవు. చిన్న ట్వీట్‌తో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చి, కాస్త ఆశ్చర్యపరిచింది. విజయ దేవరకొండ కథానాయకుడిగా.. అనన్యపాండే కథానాయికగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి-పూరి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. కనీసం ఓటీటీలో అయిన తన మార్క్ చూపిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version