BREAKING : ఉదయపూర్ ఘటనలో హైదరాబాద్ కు లింకులు !

-

BREAKING : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయపూర్ లో టైలర్ ను దారుణంగా హత్య చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. టైలర్ కన్నయ్య లాల్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఈ ఉదయపూర్ ఘటనలో హైదరాబాద్ కు లింకులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఉదయపూర్ ఘటనలో హైదరాబాద్ కు లింకుల పై nia విచారణ జరుపుతోంది. గతంలో హైదరాబాద్కు ఈ నిందితులు వచ్చిన సమాచారం అందుతోంది. 2017, 2018 లో హైదరాబాదులో ఉన్నారు నిందితులు మహమ్మద్ గౌస్, అట్టారి. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన ఎన్ఐఏ.. అట్టారీ ఫోన్లో ఆధారాలు సేకరించారు. కరాచీకి చెందిన దావత్ ఏ ఇస్లామియా కోసం హైదరాబాద్ కు వచ్చారు గౌస్, అట్టారి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version