మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.
ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులకు చోటు కల్పించగా, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.టీడీపీ-జనసేనతో పొత్తులపై రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న కమలం పార్టీ.. తొలి జాబితాలో ఏపీ జోలికి వెళ్లలేదు. పొత్తులపై స్పష్టత వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది . ఇటు తెలంగాణలో 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.ఇక 195 మంది అభ్యర్థులలో 28 మంది మహిళలకు ,47 మంది యువత, 27 మంది ఎస్సీ, 57 మంది ఓబీసీలు ఉన్నారు. 34 మంది మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు కల్పించింది.ప్రకటిస్తున్నారు.