కొత్త సంవత్సరం రాబోతుంది. చాలా మంది నూతన సంవత్సరంలో కొన్ని పనులు మొదలుపెడదాం అనుకుంటారు. అలాగే ఎటైనా టూర్ ప్లాన్ చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. 2024లో సెలవులు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ లీవ్ ఏ నెలలో పెట్టుకోవచ్చు అని ఇప్పటి నుంచే సన్నాహాలు చేసే వాళ్లు ఎందరో.! మీరు కూడా ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా లాంగ్ వీకెండ్ కోసం ఏదైనా ప్లాన్‌లు చేసుకుంటుంటే, వచ్చే ఏడాది కలిసి చాలా సెలవులు ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది 2024లో వచ్చే గెజిటెడ్ సెలవుల జాబితాను (2024లో సెలవుల జాబితా) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ జాబితాలో 17 తప్పనిసరి సెలవులు చేర్చబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో 17 గెజిటెడ్ మరియు 31 ఇతర సెలవులు ఉన్నాయి. వచ్చే ఏడాది సెలవులు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.!
2024లో సెలవులు ఎప్పుడు ఉంటాయంటే..
గణతంత్ర దినోత్సవం -26 జనవరి
హోలీ – 25 మార్చి
గుడ్ ఫ్రైడే – 29 మార్చి
ఈద్ ఉల్ ఫితర్ (ఈద్ ఉల్ ఫితర్ 2024)- 11 ఏప్రిల్
రామ నవమి (రామ నవమి 2024)- 17 ఏప్రిల్
మహావీర్ జయంతి – ఏప్రిల్ 21
బుద్ధ పూర్ణిమ (బుద్ధ పూర్ణిమ 2024)- 23 మే
బక్రీద్ – జూన్ 17
మొహర్రం – జూలై 17
స్వాతంత్ర్య దినోత్సవం – ఆగస్టు 15
జన్మాష్టమి – ఆగస్టు 26
ఈద్-ఎ-మిలాద్- 16 సెప్టెంబర్
గాంధీ జయంతి – అక్టోబర్ 2
దసరా – 12 అక్టోబర్
దీపావళి – 31 అక్టోబర్
గురునానక్ జయంతి – నవంబర్ 15
క్రిస్మస్ (క్రిస్మస్ 2024)- 25 డిసెంబర్
జనవరి 26 శుక్రవారం వచ్చింది. శని, ఆది ఎలాగో వీకెండ్ హాలిడీసే.. అంటే ఒకేసారి మూడు రోజులు సెలవులు. చిన్న ట్రిప్ వెళ్లిరావొచ్చు. లేదంటే హ్యాపీగా ఇంట్లోనే ప్రశాంతంగా గడపొచ్చు. గుడ్ ఫ్రైడే కూడా అంతే.. ఒకేసారి మూడు సెలవులు. ఏప్రిల్ 11 ఈద్ ఉల్ ఫితర్ గురువారం వచ్చింది, 12 ఎలాగో చాలా మంది సిక్ లీవ్ పెడతారు..ఇక శని, ఆది వీక్‌ఆఫ్.. ఒకేసారి..నాలుగు రోజులు..ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటే.. సెలవులను కరెక్ట్‌గా వాడుకోవచ్చు మరీ.!