2021లో ప‌బ్లిక్ హాలిడేస్ ఇవే.. పూర్తి జాబితా..

-

క‌రోనా లాక్ డౌన్‌తోనే దాదాపుగా 2020 మొత్తం గ‌డిచిపోయింది. జనాల‌కు సెల‌వుల‌కు, సాధార‌ణ రోజుల‌కు పెద్ద‌గా తేడాలు తెలియ‌లేదు. నెల‌ల త‌ర‌బ‌డి ఇళ్ల‌లోనే ఉన్నారు. దీంతో అస‌లు ఈ సంవ‌త్స‌రంలో ఏయే రోజుల్లో ఏయే సెల‌వులు ఉన్నాయి ? అనే విష‌యాన్ని కూడా మ‌రిచిపోయారు. అయితే 2021 మ‌న‌కు శుభ సూచ‌కంగా ఉండ‌బోతున్న త‌రుణంలో క‌నీసం వ‌చ్చే ఏడాది అయినా సెల‌వుల‌ను జ‌నాలు ఎంజాయ్ చేయాల‌ని చూస్తున్నారు. క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంది క‌నుక త్వ‌ర‌లోనే మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని ఆశిస్తున్నారు. ఇక వ‌చ్చే ఏడాదిలో జ‌నాల‌కు ల‌భ్యం కానున్న సెల‌వుల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

జ‌న‌వ‌రి 1 – న్యూ ఇయ‌ర్స్ డే
జ‌న‌వ‌రి 14 – మ‌క‌ర సంక్రాంతి
జ‌న‌వ‌రి 26 – రిప‌బ్లిక్ డే
మార్చి 11 – మ‌హాశివ‌రాత్రి
మార్చి 29 – హోలీ
ఏప్రిల్ 2 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 13 – ఉగాది
ఏప్రిల్ 21 – శ్రీ‌రామ‌న‌వ‌మి
ఏప్రిల్ 25 – మ‌హావీర్ జ‌యంతి
మే 1 – కార్మిక దినోత్స‌వం
మే 13 – ఈద్‌-ఉల్‌-ఫిత‌ర్
మే 26 – బుద్ధ పూర్ణిమ
జూలై 12 – ర‌థ‌యాత్ర
జూలై 20 – బ‌క్రీద్
ఆగ‌స్టు 10 – మొహ‌ర్రం
ఆగ‌స్టు 15 – స్వాతంత్య్ర దినోత్స‌వం
ఆగ‌స్టు 21 – ఓనం
ఆగ‌స్టు 22 – ర‌క్షా బంధ‌న్
ఆగ‌స్టు 30 – శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి
సెప్టెంబ‌ర్ 10 – వినాయ‌క చ‌తుర్థి
అక్టోబ‌ర్ 2 – గాంధీ జ‌యంతి
అక్టోబ‌ర్ 15 – ద‌స‌రా
న‌వంబ‌ర్ 4 – దీపావ‌ళి
న‌వంబ‌ర్ 19 – మిలాద్ ఉన్ న‌బీ
న‌వంబ‌ర్ 19 – గురుపుర‌బ్
డిసెంబ‌ర్ 25 – క్రిస్మ‌స్

ఇక ఇవే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అక్క‌డి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి సెలవులు వేరే విధంగా ఉంటాయి. అలాగే వాటి తేదీల్లోనూ మార్పులు ఉండ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version