దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తుంది కేంద్ర సర్కార్. కరోనా వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి. తాజాగా కరోనా ప్రభావం సహా కరోనా ప్రభావిత ప్రాంతాలు, జోన్ల విస్తరణ, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ ఒక లేఖ రాసారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆమె ఈ లేఖ రాసారు.
ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జోన్లను ప్రకటించారు. ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఆధారంగా జోన్లను విభజించింది కేంద్రం. ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు, వ్యాప్తి, దాని తీవ్రత ఏ విధంగా ఉంది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఆయా రాష్ట్రాల్లో రెడ్ ఆరెంజ్ జోన్లను మార్చామని ఆమె పేర్కొన్నారు. పలు రాష్ట్రాలు తమకు ఇప్పటికే విజ్ఞప్తులు పంపించి జోన్ల వివరాలను వెల్లడించాయని వివరించారు.
తెలంగాణాలో జోన్లను ఈ సందర్భంగా సిఎస్ సోమేశ్ కుమార్ కి రాసిన లేఖలో ప్రస్తావించారు.
రెడ్ జోన్ జిల్లాలు
- హైదరాబాద్
- సూర్యాపేట
- రంగారెడ్డి
- మేడ్చల్ మల్కాజిగిరి
- వికారాబాద్
- వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్ జిల్లాలు
- నిజామాబాద్
- జోగులాంబ గద్వాల
- నిర్మల్
- నల్గొండ
- ఆదిలాబాద్
- కామారెడ్డి
- సంగారెడ్డి
- కొమరం భీం
- అసిఫాబాద్
- ఖమ్మం
- కరీంనగర్,
- మహబూబ్ నగర్
- జగిత్యాల
- రాజన్న సిరిసిల్ల
- జయశంకర్ భూపాలపల్లి
- మెదక్
- జనగాం
- నారాయణపేట
- మంచిర్యాల
గ్రీన్ జోన్ జిల్లాలు;
- పెద్దపల్లి
- నాగర్ కర్నూల్
- ములుగు
- భద్రాద్రి కొత్తగూడెం
- మహబూబాబాద్
- సిద్దిపేట
- వరంగల్ రూరల్
- వనపర్తి
- యాదాద్రి భువనగిరి
తాజాగా లాక్ డౌన్ ని కేంద్రం రెండు వారాలు పెంచింది. దీనితో కొన్ని ఆంక్షలను గ్రీన్, ఆరెంజ్ జోన్ లో సడలిస్తూ మద్యం విక్రయాలు సహా ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చారు. రెడ్ జోన్ లో మాత్రం ఆంక్షలు కఠినంగా అమలు చేయడమే కాకుండా వంద శాతం లాక్ డౌన్ ఉంటుంది. గ్రీన్ జోన్ లో పూర్తి కార్యాకలాపలకు అనుమతులు ఇచ్చింది. వీటిని రాష్ట్రాలు కేసుల తీవ్రత ఆధారంగా మార్చుకునే అవకాశం ఉంది.