చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు : కేటీఆర్

-

తెలంగాణ ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగున్నర నెలల కాలంలో చిల్లర మాటలు..ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఆశించింది.. ప్రభుత్వం నుంచి ఏందంటే.. నాలుగు మంచి మాటలు. కానీ ఈ సీఎం వైఖరి గత నాలుగున్నర నెలలుగా చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు.

ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు ,కేసీఆర్‌కు ఉల్టా పని చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను తీసేస్తాం అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టాం అని తెలిపారు. అలాగే మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు పోరాటం చేసి సాధించుకున్న జిల్లాలు ఉన్నాయి. అందులో రాజన్న సిరిసిల్ల ఒకటి అని అన్నారు. ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించుకున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version