బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ … ఆసియా కప్ నుండి స్టార్ ప్లేయర్ అవుట్ !

-

ఈ రోజు నుండి శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో స్టార్ట్ కానుంది. ఆసియా కప్ స్టార్టర్ లో పాకిస్తాన్ నేపాల్ తో తలపడనుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ టీం కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఆసియా కప్ లో పాల్గొననున్న టీం ను ప్రకటించగా, అందులో కీపర్ బ్యాట్స్మన్ అయిన లిటన్ దాస్ కు వైరల్ ఫీవర్ రావడం వలన జట్టుతో పాటు శ్రీలంక బయలుదేరలేదని టీం యాజమాన్యం తెలిపింది, అంతేకాకుండా ఇక లిటన్ ఆసియా కప్ కు దూరం అయ్యాడని అధికారికంగా తెలుస్తోంది. ఇది నిజంగా బంగ్లాకు గట్టి దెబ్బ అని చెప్పాలి. బంగ్లాదేశ్ తరపున వన్ డే లలో ఇటీవల మంచి స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్మన్ గా ఉన్నాడు.

కానీ ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం అంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇతని స్థానంలో అనాముల్ హాక్ ను బంగ్లా టీం యాజమాన్యం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version