మారని లోన్ యాప్ నిర్వాహకులు.. యువతి ఫోటో మార్ఫింగ్‌ చేసి

-

గత కొన్నాళ్లుగా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లాలో మార్ఫింగ్ ఫొటోలతో ఓ యువతికి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంగం మండలంలో నివాసం ఉండే యువతి వారం రోజుల క్రితం అత్యవసరంగా 3వేల రూపాయలు అవసరమై లోన్ యాప్ లను గూగుల్ లో సెర్చ్ చేసింది. క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్ లలో యువతి తన వివరాలను అప్లోడ్ చేసింది. రెండు యాప్ ల నుంచి రూ.3,700 యువతి అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి.

3 రోజుల తరువాత తీసుకున్న అమౌంట్ ను యువతి తిరిగి చెల్లించింది. అయినప్పటికీ, ఇంకా బకాయి ఉన్నారని లోన్ యాప్ నిర్వాహకుల నుంచి యువతికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగదు కట్టకపోతే ఫోటో లను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని యువతిని భయపెట్టారు. శుక్రవారం యువతి ఫోన్ ను యాప్ నిర్వహకులు హ్యాక్ చేసి, మార్ఫింగ్ చేసిన యువతి ఫోటోలను కాంటాక్ట్ నెంబర్లకు పంపించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి రోధిస్తూ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్ యాప్ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. సైబర్ పోలీసులకు కూడా వివరాలను అందించారు. లోన్ యాప్ నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని యువతికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version