పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మూడు కీలక బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా లోక్ సభలో ఆమోదం తెలిపింది. ఇందులో రెండు ఆర్థిక బిల్లులతో పాటు ఓ వైద్య బిల్లు కూడా ఉండటం విశేషం. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి.
భారతీయ ఔషధ వ్యవస్థపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లును కేంద్ర మంత్రి శర్భానంద్ సోనోవాల్ లోక్సభలో ప్రవేశ పెట్టగా స్పీకర్ దాన్ని అమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇక మంత్రి నిర్మల సీతారామన్ పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. దీన్ని కూడా లోక్ సభ చర్చ లేకుండానే ఆమోదించింది. అనంతరం డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ బిల్లును నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.