ఆయనో పొగరుబోతు బిలీనియర్.. ఎలాన్ మస్క్ పై ఆస్ట్రేలియా ప్రధాని ఫైర్

-

టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్పై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటో ఆల్బనీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్కో ఓ పొగరుబోతు బిలియనీర్ అంటూ ఫైర్ అయ్యారు. తనకు తాను చట్టానికి అతీతుడిగా మస్క్‌ భావిస్తున్నారని విమర్శించారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చర్చి బిషప్‌పై జరిగిన కత్తిదాడికి సంబంధించిన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా ఎక్స్‌ను అక్కడి ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. దాడికి సంబంధించిన పోస్టులపై నిషేధం విధించేందుకు అనుమతించాలంటూ ఆస్ట్రేలియా సైబర్‌ నియంత్రణా సంస్థ ‘ఈ-సేఫ్టీ’ కమిషనర్‌ చేసుకున్న విజ్ఞప్తిని సోమవారం ఫెడరల్‌ కోర్టు అంగీకరించింది. రెండురోజుల పాటు ఆ సంఘటనకు సంబంధించిన కంటెంట్‌ను నిలువరించాలని ‘ఎక్స్‌’ను ఆదేశించింది. దీనిపై ఎక్స్ స్పందిస్తూ.. కేవలం ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే దాన్ని ఆపేసింది. ఆ దేశం వెలుపల ఉండే యూజర్లకు మాత్రం అవి కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ను నియంత్రించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.

దీంతో ‘ఎక్స్‌’ తీరుపై ఆసిస్ పీఎం ఆల్బనీస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. సోషల్‌ మీడియాకు సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఎలాన్‌ మస్క్‌ తమ ప్లాట్‌ఫామ్‌పై హింసాత్మక కంటెంట్‌ను ఉంచేందుకు పోరాడటం విడ్డూరంగా ఉందని.. మస్క్‌ ‘పొగరుబోతు బిలియనీర్‌’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version