సైకో త్వరలో పోతాడు, సైకిల్ రావడం ఖాయం అని హెచ్చరించారు నారా లోకేష్. మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నారని పట్టభద్రుల ఫలితాలు వెల్లడించాయి. సైకో త్వరలో పోతాడు, సైకిల్ రావడం ఖాయం అన్నారు లోకేష్. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయానికి హంద్రీనీవా జలాలను బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీరు వెళ్తుంది. నిలిచిపోయిందనుకున్న ప్రాజెక్టు పనులు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి 2018లో పూర్తి చేశారన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించారు. నదుల అనుసందానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 565 కి.మీ నుండి సీమకు చంద్రబాబు తీసుకొచ్చారు. 8 నియోజకవర్గాల్లోని 28 మండలాలకు ఈ నీరు చేరుతుంది. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందించడమే చెర్లోపల్లి జలాశయం లక్ష్యం. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాలోనూ చెరువులను నింపి తద్వారా తాగునీరు అందిస్తారు. జగన్ కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా ఇలా సెల్ఫీ దిగే దమ్ము ఉందా? అని నిలదీశారు లోకేష్.