తోటకూర తో లాభాలు బోలెడు..ఎలా అంటే..?

-

తోట కూర చాలా చౌకగా లభించే ఆకుకూరల్లో ఒకటి. ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం. పాలకూర, మెంతికూర,పచ్చి కాయగూరలకు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు . కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు. తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో పుష్కలంగా దొరకడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడం లో సహాయపడుతుంది.

దీనివల్ల టైప్ -2 షుగర్ తో బాధపడుతున్నవారికి తోటకూర చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే ఆకలిగా అనిపించదు.ఇది తక్షణ శక్తికి ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి, హైపర్ టెన్షన్ వున్నవారికి మేలు చేస్తుంది. ఇక ఎముకలు బలంగా ఉండేందుకు కాల్షియం అవసరం. తోటకూర నుంచి మన శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది. కాబట్టి తోటకూర తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్యను అధిగమించవచ్చు. ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలలో కాల్షియం తగ్గి ఎముకలు గుల్లబారిపోయి మెత్తగా పట్టుకుంటే విరిగేలాగా వుంటాయి.తోటకూరలో కీలకమైన లైసిన్ కూడా ఉంటుంది. ఇదొక అమైనో యాసిడ్ లా పనిచేస్తుంది. విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ , కేన్సర్ కణాలతో పోరాటానికి సాయపడుతుంది.

ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగానిరోధక శక్తిని పెంచుతుంది. తోటకూర జ్యూస్ గా తయారుచేసుకొని తలకు మర్దనా చేసుకోవడంవల్ల చుండ్రు తగ్గి, కొత్త జుట్టు రావడానికి దోహదం చేస్తుంది.రక్తనాలాలను చురుగ్గా ఉంచి గుండె పనితీరు మెరుగుపరిచే సోడియం, పాస్పరస్ లు మెండుగా వుంటాయి.తోటకూరను విటమిన్ ల గని అని చెప్పొచ్చు. ఎందుకంటే విటమిన్ ఎ, సి, డి,ఇ, బీ12, బీ6 లు అధికంగా వుంటాయి.తోట కూరను గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారికి ఐరన్ లోపం తగ్గుతుంది మరియు ప్రసవానికి ఉపయోగపపడే b12 పుష్కళంగా అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version