ప్రేమించిన యువతి దూరమైందనే కారణంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవణ్మరనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పరపల్లికి చెందిన మహేందర్.. గత కొంతకాలంగా అడ్డగుట్టలోని సాయి హర్షిత బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు.అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్తూ వచ్చేవాడు. అయితే, అనుకోకుండా మహేందర్ హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అతని మృతికి ప్రేమ విఫలమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.