Valentaines Day : ల‌వ్ సింబ‌ల్స్‌తో ల‌వ్లీ లావ‌ణ్య త్రిపాఠి.. ఫోటోలు వైర‌ల్

-

వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా సోమ‌వారం చాలా మంది సెల‌బ్రెటీలు త‌మ పోటోల‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుని.. శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కూడా త‌న ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. రెడ్ క‌ల‌ర్ ల‌వ్ సింబ‌ల్స్ బెలూన్స్ మ‌ధ్య ల‌వ్లీ లావ‌ణ్య త్రిపాఠి.. ముద్దుగా ఫోజులు ఇస్తు.. నిల్చుంది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫోటోలతో లావ‌ణ్య త్రిపాఠి ల‌వ్ రూమ‌ర్స్ మ‌రోసారి తెర పైకి వ‌చ్చాయి. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో లావ‌ణ్య త్రిపాఠి ప్రేమలో ప‌డింద‌ని.. త్వ‌ర‌లోనే వీరు పెళ్లీ పీఠ‌లు ఎక్క‌డానికి రెడీ అవుతున్నార‌ని కూడా వార్తులు వ‌చ్చాయి.

ఈ రూమ‌ర్స్ పై వ‌రుణ్ తేజ్ స్పందించ‌లేదు కానీ.. లావ‌ణ్య త్రిపాఠి మాత్రం.. తాను ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అయితే వాలంంటైన్స్ డే రోజు ల‌వ్ సింబ‌ల్స్ మ‌ధ్య నిల‌బ‌డి ముద్దులు పెట్టిన‌ట్టు ఫోజు పెట్ట‌డంతో మ‌రోసారి ఈ రూమర్స్ తెర పైకి వ‌చ్చాయి.

ఏది ఏమైనా.. ఈ ఫోటోల్లో లావ‌ణ్య త్రిపాఠి మాత్రం.. లుక్స్ అదిరిపోయాయి. చూట్టు రెడ్ క‌లర్ ల‌వ్ సింబ‌ల్స్ మ‌ధ్య లైట్ పింక్ డ్రెస్ వేసుకున్న ల‌వ్లీ లావ‌ణ్య త్రిపాఠి.. మెరుస్తుంది. దీంతో అభిమానులు ఎంత అందం అంటూ కామెట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version