ఆవాల నూనెతో వంట చేస్తుంటారా..? అయితే దాని వలన ఎన్ని లాభాలంటే..?

-

వంటకి చాలా మంది వాళ్ళకి నచ్చిన నూనెల్ని వాడుతూ ఉంటారు. అయితే కొందరు ఆవాల నూనెని కూడా వంటల్లో వాడుతూ ఉంటారు. మీరు కూడా వంటల్లో ఆవాల నూనెని వాడుతున్నారా..? అయితే దాని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఆవాల నూనె తో వంట చేయడం అనేది చాలా మంచిది అని తెలుస్తోంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా మనం ఆవాల నూనెతో పొందొచ్చు.

మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ ని పెంపొందిస్తుంది. అదే విధంగా ఇది సెల్స్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆవాలు నూనెలో మనకి 60 శాతం మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బరువు కంట్రోల్లో ఉంటుంది:

ఆవాల నూనెను తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎనర్జీ మరియు కేలరీలను మన బాడీకి ఇస్తుంది. అలానే బరువుని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆవాల నూనెను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

క్యాన్సర్ రిస్క్ ఉండదు:

ఆవాల నూనె తో వంట చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. లినోలిక్ యాసిడ్ ఆవాల నూనె లో ఉంటుంది. అలాగే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కింద ఇది మారిపోతుంది. దీనితో ఇది క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది.

నొప్పులు మరియు గాయాలన్ని తగ్గిస్తుంది:

ఆవాల నూనె తీసుకోవడం వల్ల నొప్పులు గాయాలు తగ్గుతాయి. ఆవాలు నూనెలో యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి ఇది బ్యాక్టీరియా పెరిగి పోకుండా చూసుకుంటుంది. ఇలా ఇన్ని లాభాలని ఆవాల నూనెతో పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version