ఎల్ ఆర్ ఎస్ మరోసారి ప్రకటించిన తెలంగాణా

-

టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌… మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపు చేయనున్నారు. మరోసారి ఎల్ ఆర్ ఎస్ కు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఆగస్టు 28, 2020 వరకు సేల్ డిడ్ ఉన్న వాటికే అవకాశం ఇచ్చింది. ఆక్టోబర్ 15 వరకు తుది గడువు పెట్టింది.

Government if Telangana

10 హెక్టార్లకు, మించి ఉన్న నదులు, సరస్సుల సరిహద్దులకు లే అవుట్ 30 మీటర్ల దూరంలో ఉం డాలని పేర్కొంది. 10 హెక్టార్ల లోపు సరస్సులు, కుంటలు, శిఖం భూములకు 9 మీటర్లు దూరంలో లే అవుట్ లు ఉండాలి. 3000 గజాల వరకు ఉన్న భూమికి మార్కెట్ విలువలో 25% ఎల్ ఆర్ ఎస్ చార్జెస్ ఉంటాయి. 3001 నుండి 5000 గజాల వరకు ఉన్న భూమికి మార్కెట్ విలువలో 50% ఎల్ ఆర్ ఎస్ చార్జ్ చేస్తారు. 5001నుండి 10000 గజాల వరకు ఉన్న భూమికి మార్కెట్ విలువలో 75% ఎల్ ఆర్ ఎస్ చార్జ్ చేస్తారు. 10000 గజాల పైగా వరకు ఉన్న భూమికి మార్కెట్ విలువలో 100% ఎల్ ఆర్ ఎస్ చార్జ్ ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version