పంజాబ్‌ కింగ్స్‌పై లక్నో ఘన విజయం

-

ఐపీఎల్ సీజన్ 2022లో ఎంసీఏ స్టేడియం వేదికగా శుక్రవారం రసవత్తర పోరు జరిగింది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ రబాడ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్‌ 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. దీపక్‌ హుడా 34 పరుగులు చేశాడు. చివర్లో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో రబాడ 4, రాహుల్‌ చహర్‌ 2, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ తీశాడు. ఆ తరువాత.. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌(25) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 54 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లక్నో బౌలర్ల దాటికి పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version