తెలియని ప్లేసులకు వెళ్లినప్పుడు మనకు అన్నీ తిప్పి చూపించడానికి ఒక గైడ్ ను పెట్టుకుంటాం. ఆ గైడ్ కు ఫీజ్ ఎంతుంటుంది.. వేలల్లోనే,మహా అయితే లక్షల్లో ఉంటుంది కదా..! కానీ ఓ టూరిస్ట్ గైడ్ కోట్లల్లో వసూలు చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలు.. అంతర్జాతీయ స్థాయి కోటీశ్వరులు సైతం.. విహార యాత్రలకు వెళ్లాలంటే ఈమెనే సంప్రదిస్తారట.. వామ్మో అంత ఫేమస్సా..! అనుకుంటున్నారా.. మరి అంతే.. ఆమెలో అంత ప్రత్యేకం ఏముంది.? ప్రముఖులు సైతం టూర్ కు వెళ్లాలంటే.. ఈమెను ఎందుకు సంప్రదిస్తున్నారు..? చూద్దామా..!
జాక్వెలిన్ సియన్నాకు చిన్నప్పటి నుంచి పర్యాటక రంగమంటే ఇష్టం ఉండేదట. ప్రపంచమంతా తిరిగి రావాలని కలలు కనేది. భారతీయ మూలాలున్న జాక్వెలిన్.. ఫిలడెల్ఫియా టెంపుల్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో ప్రత్యేక కోర్సు చేసింది. 2015లో ‘వోయెజ్’ పత్రికను ప్రారంభించి, ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస, అక్కడి రుచుల సమాచారాన్ని అందించేది.
2008లో న్యూయార్క్ కేంద్రంగా పర్యటకులకు మార్గనిర్దేశం చేసేందుకు ‘సియన్నా ఛార్లెస్’ ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖుల అభిరుచులు, వారి ఆసక్తి, జీవనశైలి గురించి తెలుసుకున్న ఆమె..దీన్ని ప్రముఖ పర్యాటక సంస్థగా మార్చడానికి తీవ్రంగా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే లగ్జరీ ట్రావెల్ ఏజెంట్‌గా పేరు తెచ్చుకుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ ఆయన సతీమణి లారాతో కలిసి 2015లో ఇథియోపియా సందర్శనకు వెళ్లినపుడు గైడ్‌గా పనిచేసింది జాక్వెలిన్. ‘అప్పటికే ప్రముఖులెందరికో పర్యాటకంలో సేవలందించిన తనకు.. బుష్‌తో పర్యటన సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది ఈ గైడ్.
జార్జిబుష్ తో పాటు.. లారా బుష్, నలుగురు స్నేహితులు, వ్యక్తిగత వైద్యుడు, 30మంది సీక్రెట్ సర్వీస్ స్టాఫ్ వచ్చారు. అలా లలిబెలాకు చేరుకున్న ఆయనకు అక్కడ వందమందికిపైగా చిన్నారులు రాయల్‌బ్లూ టెక్సాస్ రేంజర్ టోపీలు ధరించి స్వాగతం పలికేలా చేసింది… ఇటువంటి ఊహించని, మరవలేని అనుభవాలను అందేలా చేయడంలో అవతలి వారికి దక్కే సంతోషం మాటల్లో చెప్పలేం కదా… అతిథికి ముందుగా తెలియకుండా చేసే ఇలాంటి సర్‌ప్రైజ్‌లకు చాలా సంతోషిస్తారు. ఇథియోపియాలో ఆయన కోసం ముందుగానే ఒక లగ్జరీ క్యాంపు సొంతంగా సిద్ధం చేసి మరీ అతిథి సేవలు అందించిందట.
అతిథి అభిరుచిలపై డీప్ అనాలసిస్..
ఈమె.. ఆ ఏజెన్సీ ద్వారా పర్యాటకానికి వచ్చేవారి అభిరుచులూ, ఆహారపుటలవాట్లూ ముందే తెలుసుకుంటా. వెళ్లాల్సిన ప్రాంతాల విశేషాలపై పూర్తిగా అధ్యయనం చేస్తుందట.. కొందరినైతే ముందుగా వెళ్లి కలిసి,. అలా వారి అభిరుచులనే కాదు, వారికి ఉండే ఫుడ్ తదితర అలర్జీలనూ.. తెలుసుకుంటా. వారు చదివే పత్రికల గురించి కూడా ఆరా తీస్తుందట. తర్వాతే వారి పర్యటన ప్రణాళిక సిద్దం చేస్తారు.. అక్కడ వారిని ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ ప్రముఖులెవరూ మా సేవలను అందుకున్నతర్వాత మా సంస్థను మరువలేరంటోది జాక్వెలిన్.
సప్రైజ్ చేయడానికి అధిక ప్రాధాన్యం..
కొందరి అభిరుచి మేరకు సాహస యాత్రలనూ ఏర్పాటు చేస్తుంటారట.. ఒక నేతకైతే ఆయన సతీమణి పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ స్నో గులాబీలతో ఓ ప్రైవేటు విల్లా అంతా అలంకరించి సర్‌ప్రైజ్ ఇచ్చాం… ఒకసారి మియామీలో సినిమాలకు సెట్టింగ్ వేసే కళాకారులను రప్పించి పర్షియన్ సెట్‌ను సిద్ధంచేసి, ప్రముఖ చెఫ్ ఎరిక్ రిపెర్ట్ డిజైన్ చేసిన ప్రత్యేక మెనూను ఏర్పాటు చేయించారట.. ఇలా అతిథులకు ఊహించని సప్రైజ్ లు ఇస్తూ.. వారి పర్యటనను మంచి జ్ఞాపకంగా చేస్తుంది జాక్వెలిన్.
ఇప్పటివరకూ.. 80 దేశాలకు పైగా పర్యటించా. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, ప్రపంచ నేతలు… ఇలా దాదాపు 15మందికి పైగా టూరిస్ట్ గైడ్‌గా పనిచేసిందట.. వీళ్లేనా..వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులూ ఉన్నారు. భర్త ఫ్రెడ్డీ ఛార్లెస్ రీనెర్ట్ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరినట్లు జాక్వెలిన్ పేర్కొన్నారు.