నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు…అమరవీరుల కుటుంబాలను ఆర్థిక సాయం చేయలేదు : మధుయాష్కీ

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచారకమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముసుగులో ప్రజల ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. ప్రజలు, యువకులను రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకోవడానికే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు మధు యాష్కీ గౌడ్‌. ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ తలరాతలు మారతాయని ఆశపడిన నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని మధు యాష్కీ గౌడ్‌ మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు…అమరవీరుల కుటుంబాలను ఆర్థిక సాయం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యపై గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు మధు యాష్కీ గౌడ్‌.

యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మారుస్తామని చెప్పిన కేసీఆర్..దాన్ని విష నగరంగా మారుస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డ 8 ఏండ్లలో 1,35,000 కోట్లు ఆదాయాన్ని లిక్కర్ పేరుతో పెంచుకుందన్నారు మధు యాష్కీ గౌడ్‌.దేశంలో అత్యధిక లిక్కర్ సేల్స్ తెలంగాణ లోనే జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ ఆరోపించారని..గతంలో కవితతో ఆయన కలిసి పనిచేశారన్నారు. కమలనాథుల ఆరోపణలపై కవిత ఎందుకు తప్పుపట్టడం లేదని మధు యాష్కీ గౌడ్‌ ప్రశ్నించారు. ఆదాయ మార్గాలు లేకుండా కవితకు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు మధు యాష్కీ గౌడ్‌. సీఎం కేసీఆర్ వెంటనే కవితను బర్తరఫ్ చేయాలన్నారు మధు యాష్కీ గౌడ్‌. లిక్కర్ స్కాం లో కవిత పాత్ర ఏంటో ఆధారాలతో సహా బయటపెట్టాలని పర్వేశ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి దర్యాప్తు కు సహకరించాలన్నారు. తెలంగాణ జాగృతి పేరుతొ కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు మధు యాష్కీ గౌడ్‌. కేసీఆర్ కుటుంబీకులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాలని సూచించారు. లిక్కర్ స్కాం లో కేసీఆర్ పాత్ర పైనా సిబిఐ, ఈడి దర్యాప్తు చేయాలని..ఆప్ నేతలపై కూడా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలని సూచించారు. కాళేశ్వరం అవినీతి పై కేంద్రం దర్యాప్తు జరపాలన్నారు మధు యాష్కీ గౌడ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version