రైతుల ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రైతు విజయోత్సవ ర్యాలీ చేసింది. కొవ్వత్తులతో నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల అరిగోస పడుతుంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని మధుయాష్కీ విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటే అని ఆయన విమర్శించారు. గాడ్సెను అభిమానించే బీజేపీ పార్టీ రైతులు చేసిన గాంధీ అహింసా మార్గానికి లొంగిందని అన్నారు. రైతు చట్టాలను రద్దు చేయడమే కాదు.. లఖీంపూర్ ఖేరీ ఘటనకు బాధ్యుడైన కేంద్రమంత్రిని తొలగించినప్పుడే చనిపోయిన రైతులకు నిజమైన న్యాయం జరగుతుందని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
గతంలో ట్రంప్ పర్యటనకు వచ్చినప్పుడే కరోనా గురించి రాహుల్ గాంధీ హెచ్చరించారని.. తర్వత వ్యవసాయ చట్టాలను గురించి వ్యతిరేఖించినప్పుడు బీజేపీ సర్కారు పట్టించుకోలేదని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు మద్దతు తెలుపుతూ .. అన్నం పెట్టే రైతును ఆదుకోవడం లేదని మోదీ, కేసీఆర్ ను విమర్శించించారు సీతక్క