గుజరాత్, మధ్యప్రదేశ్ లో భార్యలను ఇంకా అద్దెకు ఇస్తున్నారా…?

-

సమాజం ఆధునికత వైపుకి అడుగులు వేస్తుంది… ఆటవిక సమాజం నుంచి బయటకు వస్తున్నారు ప్రజలు. అభివృద్ధి వైపు, స్మార్ట్ ఫోన్ వైపు పరుగులు పెడుతున్నారు. తమకు ఉన్న అలవాట్లను కూడా ప్రజలు దూరం చేసుకుని సమాజానికి తగినట్టు జీవించడం మొదలుపెట్టారు. మానవ సంబంధాలకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కొన్ని కొన్ని పనులు చేస్తే సమాజం చీదరించుకుంటుంది అనే భయం జనంలో వచ్చింది. మనం చేసే పని వంది మంది చూస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే విధంగా జనం ఆలోచన ఉంది…

కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇదేమీ కనపడటం లేదు… ఆటవిక పద్దతుల్లో జీవనం సాగిస్తున్నారు. ఒకసారి ఈ కథ చదివితే మీకు నిజమనే అభిప్రాయం కచ్చితంగా కలుగుతుంది. అవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు… ఆ గ్రామాల్లో ధనవంతుల యువకులు ఎక్కువ. వాళ్లకు చదువు రాకపోయినా సరే భారీగా ఆస్తులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించాలి అంటే వాళ్లకు భార్యలు కావాలి. వయసు మీద పడుతున్నా వివాహం చేసుకోవడానికి మాత్రం అమ్మాయి దొరకడం లేదు… దీనితో కొత్తగా ఆలోచించారు.

పూటగడవని వాళ్ళను పిలిచి మీ భార్యను నాతో కాపురం చేయించు నెలకు ఇంత ఇస్తాను అంటూ భేరం మాట్లాడుకుంటున్నారు. దీని గురించి గత ఏడాది ప్రధాన పత్రికల్లో రాగా అధికారులు దృష్టి సారించారు. అయినా సరే ఇది మాత్రం ఆగడం లేదు. పూట గడవని ఇళ్ళల్లో ఉండే మహిళలు పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం మరొకరికి అద్దె భార్యగా వెళ్తున్నారు. భర్తలు లేని వాళ్ళు అయితే పిల్లల కోసం దీనిని వృత్తిగా మార్చుకున్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఈ దారుణాలు బయటకు వచ్చాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ అద్దె భార్యల వ్యాపారం ఆగడం లేదు. దీనికి కూడా కొందరు దళారులు తయారు కావడం ఆందోళన కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version