అబ్బాయి కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు… గుడ్లు తింటూ చచ్చిపోయాడు…!

-

ఆహారం తినే విషయంలో పందెం కట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమాల్లో పందెం కట్టారు కదా అని నిజ జీవితంలో కడితే జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే అతి చేసి ఆహారం తిన్నా సరే ప్రాణం మీదకు వస్తుంది. అదే విధంగా డబ్బుల కోసం కక్కుర్తి పడి అతి తిండి తింటే… అదే ఆఖరి రోజు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అవగాహన లేక ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి మేము అంత తింటాం ఇంత తింటాం అంటూ పందెం కడుతూ ఉంటారు. అర్ధంతరంగా తనువు చాలిస్తూ ఉంటారు.

తాజాగా ఈ తరహా సంఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రెండు వేలకు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని జైన్‌పూర్‌లోని బీబీగంజ్ బజార్‌లో నివాసం ఉండే సుభాష్ యాదవ్ ట్రాక్టర్ నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. మొదటి భార్యకు నలుగురూ కుమార్తెలు పుట్టడంతో వంశం అర్ధంతరంగా ఆగిపోవద్దని భావించి… రెండో వివాహం చేసుకున్నాడు అతను… ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది… అది అలా ఉంటే అతను తన స్నేహితుల వద్ద 50 కోడి గుడ్లు తింటాను అని పందెం కట్టాడు.

దీనికి అతని స్నేహితులు కూడా ఒప్పుకుని… ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగడంతో పాటుగా 50 కోడి గుడ్లు తినాలి అని పందెం పెట్టారు. దీనికి అంగీకరించిన సుభాష్… తినడం మొదలుపెట్టగా 41 గుడ్లు తిని 42 గుడ్డు నోట్లో పెట్టాడో లేదో స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే గమనించిన అతని స్నేహితులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా లాభం లేదని చెప్పడంతో లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అతను ప్రాణాలు కోల్పోయాడు. దీనితో అతని నలుగురు కుమార్తెలు, ఇద్దరు భార్యలు అనాథలుగా మారిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version