శ్రీశైలంలో మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు..!

-

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. వాహనాల పార్కింగ్, జంగిల్ క్లియరెన్స్ త్వరగా పూర్తి చేసి చదును చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రధానాలయం ముందు నుండి నంది గుడి వరకు భక్తులకు తాత్కాలిక షెడ్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయాలన్నారు ఈవో. ఇక పార్కింగ్ ప్రదేశాలలో మంచినీరు, విద్యుత్, ప్రథమచికిత్స, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ సూచించారు ఈవో శ్రీనివాసరావు.

అయితే లడ్డు విక్రయ కేంద్రాలకు ఎడమ వైపు ప్రదేశాన్ని విఐపి వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ ఏడాది మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు యాంపీ థియేటర్ లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు కావాల్సిన మిగిలిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version