Telangana: మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంపు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహాశివరాత్రి కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ నేపథ్యంలోనే 50 శాతం చార్జీలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహాశివరాత్రి కోసం స్పెషల్ గా వేసిన ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను 50% శాతం పెంచినట్లు తెలుస్తోంది.

Maha Shivratri special bus fares increased by 50 percent

అయితే ఇదే బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని కల్పించనున్నారట. కానీ పురుషుల టికెట్లపై మాత్రం 50% ధర పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24 అంటే రేపటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు మహాశివరాత్రి స్పెషల్ బస్సులు నడుస్తాయి. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట వేలాల కాలేశ్వరం కొమురవెల్లి అలంపూర్ రామప్పకు.. ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version