ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం మినహా చాలా ప్రశాంతంగా వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు.

నిన్నటితో కుంభమేళా ప్రారంభమై 15 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే నాడు హాలిడే కావడంతో భక్త జనం పొటెత్తారు. సుమారు 1.74 కోట్ల మంది భక్తులు నిన్న ఒక్కరోజే పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.కుంభమేళా ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 13.21 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభ్ జరగనుంది.