ప్రముఖ గురువు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆత్మహత్య కు ముందు నరేంద్ర గిరి రాసిన సూసైడ్ తో ఆత్మహత్యపై అనుమానాలు మొదలయ్యాయి. నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే ఆరు నుండి ఏడు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో మహంత్ తన శిష్యుడు ఆనంద్ గిరి పేరును రాసినట్టు పోలీసులు బెబుతున్నారు.
ఇప్పటికే పోలీసులు ఆనంద్ గిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతే కాకుండా ప్రముఖ లేటే మనుమాన్ దేవాలయం పూజారి కొడుకును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహంత్ నరేంద్ర మృతికి సంబంధించి ప్రయాగ్ రాజ్ లోని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమొదయ్యింది. ఇక నిన్న ఆత్మహత్య చేసుకున్న నరేంద్ర గిరి మృతదేహం ఫ్రిజ్ లో పెట్టారు. నేడు ప్రజలు మృతదేహాన్ని చూసేందుకు ప్రజలను అనుమతిస్తున్నారు.