లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్ లోకి వెళ్తుందా! లేక ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తుందా అని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తుంటే, మందు బాబులు మాత్రం మందు దొరకడం లేదని గొడవలు చేస్తున్నారు, ఇంకొంత మందైతే ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు మద్యం నుండి సింహ భాగం ఆదాయం వస్తుంది. అలాంటి ఇప్పుడు మద్యం షాప్స్ బంద్ కావడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ![Wholesalers Warn Of 'Black Market Liquor' If Liquor Stores Close ...](https://specials-images.forbesimg.com/imageserve/916579326/960x0.jpg?fit=scale)
అయితే ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకు చిల్డ్ బీర్ లాంటి వార్తను మందు బాబులకు తెలియజేశారు. త్వరలోనే రాష్ట్రంలో మద్యం షాప్స్ ఓపెన్ చేస్తామని ఒక మంత్రి తెలిపారు. అయితే కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే మద్యం షాప్స్ తెరుస్తామని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
![Wholesalers Warn Of 'Black Market Liquor' If Liquor Stores Close ...](https://specials-images.forbesimg.com/imageserve/916579326/960x0.jpg?fit=scale)
అసలే కరోనా విజృంభిస్తుంటే ఇలాంటి సమయంలో మద్యం షాప్స్ ఓపెన్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే ఆదయంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. మాములు జనాలే సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు మందు బాబులు ఎలా పాటిస్తారని నాయకులను ప్రజలు సోసిల మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే త్వరలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా మద్యం షాప్స్ తెరవడంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికె మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.