ప్రముఖ గోదావరి నదిలో మహారాష్ట్ర తప్పుడు పనులు చేస్తూనే ఉంది. ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గోదావరిలో ఆల్కాహాల్ వ్యర్ధాలను మహారాష్ట్ర వదులుతుంది. నిర్మల్ జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గోదావరిలో కి మహారాష్ట్ర ఆల్కహాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు వస్తున్నాయి. ఇలా వదలడంతో బాసర వద్ద పూర్తిగా కలుషితమయ్యాయి గోదావరి జలాలు.
ప్రతి ఏటా ఇదే జరుగుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చినప్పుడు వ్యర్థాలను అల్కహాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వదులుతుంది. దీనితో జిల్లా కలెక్టర్ కి కూడా అక్కడి ప్రజలు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవసరం అయితే సిఎం కేసీఆర్ ని కూడా కలుస్తామని నిర్మల్ జిల్లా ప్రజలు అంటున్నారు.