రికార్డ్ మోత మోగిస్తున్న వన్ మ్యాన్ షో..!!

-

మహేష్ బాబు.. చివరిసారిగా సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక దాదాపు రెండు, సంవత్సరాల గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల ముందు నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పేరిట కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించడం గమనార్హం. అంతేకాదు ఈ రోజు ఉదయం ప్రీమియర్ షో వేయగా మంచి కలెక్షన్లను రాబట్టి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అప్పటివరకు ఉన్న రికార్డులు సైతం కొల్లగొట్టడం జరుగుతోంది. మహేష్ బాబు సినిమా మొత్తానికి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇక ఈ సినిమాకు పల్లెటూర్లలో కూడా మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది అని చెప్పవచ్చు . అడ్వాన్స్ బుకింగ్స్ తో కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు . ఇక రిలీజ్ రోజు టికెట్ సేల్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నైజాంలో రూ. 10 కోట్లు గ్రాస్ కలెక్షన్ జరగడం గమనార్హం. ఒక్క హైదరాబాదులోనే రూ.8 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ చేసింది. మొత్తం మీద రూ.14.54 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టినట్లుగా సమాచారం.

ఇప్పటికే నిన్నటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 130 కోట్ల రూపాయల రాబట్టినట్లుగా సమాచారం. ఇక వన్ మ్యాన్ షో గా మహేష్ బాబు రికార్డుల మోత మోగిస్తున్నాడు సినిమా పరంగా స్టోరీ వీక్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం తారాస్థాయిని అందుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version