ఆఫ్రికాలో మహేష్ హీరోయిన్… వెళ్ళింది అందుకేనా…?

-

భరత్ అను నేను సినిమాతో చేసిన తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది కైరా అద్వాని. నటన, గ్లామర్ రెండింటితో ఆమె ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలివుడ్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ యువ హీరోయిన్ అక్కడ మంచి విజయాలే సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టి ఇప్పుడు బాలివుడ్ లో కూడా తన మార్క్ చూపిస్తుంది.

హిందీలో ఈ భామ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్.. ‘కబీర్ సింగ్‌’లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. రాఘవా లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ అనే ఓ హారర్ కామేడీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటిస్తుంది. తాజాగా ఆమె నటించిన గుడ్ న్యూస్ సినిమా మంచి హిట్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనితో బాలివుడ్ దర్శక నిర్మాతలు ఈ భామ వెంట పడుతున్నారు.

దీనితో పారితోషకం కూడా పెంచే ఆలోచనలో ఈ యువ హీరోయిన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ మల్హోత్రాతో కలిసి ఆమె ఆఫ్రికా వెళ్ళింది. అక్కడ ఆఫ్రికా అందాలను హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ.. ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడ ఒక షూటింగ్ కోసం వెళ్ళింది అంటే కాదు నిశ్చితార్ధం కోసం వెళ్ళింది అంటున్నారు కొందరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version