మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం కేసీఆర్..!

-

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్న సంగ‌తి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణ కేబినెట్ మంత్రులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ మంత్రి ఇలాకాలో అయినా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆయా మంత్రుల పదవులు ఊడిపోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పోటీ ఇస్తుందన్న అపోహలు వదిలిపెట్టాని వారికి ధైర్యం చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఢోకా లేదని, 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారికి భరోసా ఇచ్చారు.

అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన విస్త్రత స్థాయి సమావేశంలో సుమారు 300 మంది వరకు ముఖ్యనేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు కూడా వారికి కేటాయించిన మున్సిపాలిటీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని హితవుపలికారు. అలాగే కొత్త, పాత నేతలు అందరూ కలుపుకొని వెళ్లాలని సూచించారు. కాగా, 2020 జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జనవరి 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version