తరచు ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పంచుకున్నారు. వీటిని కనుక మీరు అనుసరిస్తే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆగ్నేయం వైపు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దాని గురించి పండితులు చెప్పడం జరిగింది. మన ఇంట్లో ఆగ్నేయం వైపు పసుపు రంగు అస్సలు వేయకూడదు. పసుపు రంగు పెయింట్ ఆగ్నేయం వైపు వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే ఇంటి పెద్ద కి మరియు ఇంట్లో ఉండే తల్లికి ఇబ్బందులు తీసుకొస్తుంది.
కాబట్టి ఎప్పుడూ కూడా పసుపు రంగుని ఆగ్నేయం వైపు వేయొద్దు. ఒకవేళ కనుక అలా చేసారు ఉంటే కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలానే ఇంటి పెద్దకి ఇబ్బందులు కలుగుతాయి, చేతులు నొప్పులు, విటమిన్ లోపం లాంటివి కలిగే అవకాశం కూడా ఉంటుంది.
అదే విధంగా ఇంట్లో ఉండే చిన్న కొడుకుకి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆగ్నేయం వైపు పసుపు రంగు వేయొద్దు. ఈ తప్పు చేయకుండా ఉంటే సమస్యలు ఉండవు లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.