మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ మూసివేత

-

హైదరాబాద్ మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ మూసివేశారు. ఈ ఆస్పత్రిలో ప్రసవాలు, ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ హాస్పిటల్​కు వచ్చే గర్భిణీలను కోఠి, పేట్లబుర్జు ఆస్పత్రులకు తరలించారు. ఇటీవల ప్రసవం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మరణించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

ఇటీవలే ఈ ఆస్పత్రికి ప్రసవానికి వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రసవం తర్వాత ఆరోగ్యం క్షీణించి మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వారు మరణించారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికలో.. ఆస్పత్రిలో అపరిశుభ్రత వల్ల వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్​ వల్లే ఇద్దరు బాలింతలు మృతి చెందారని తేలింది. ఈ క్రమంలోనే వైద్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version