బాలింతల మృతి కేసు.. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

-

హైదరాబాద్‌ మలక్‌పేట్ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనలో బాలింతల కుటుంబాలకు ఆర్డీవో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వైద్యశాఖ కమిషనర్ స్పందించారు. బాలింతల మృతిపై దర్యాప్తునకు కమిటీ వేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాలింతలు మరణించడం దారుణం అన్నారు. వీరి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. గతంలో ఇబ్రహీంపట్నంలో నలుగురు చనిపోయారని గుర్తుచేశారు. నాలుగు నెలల్లోనే మళ్లీ అలాంటి ఘటన జరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లోనే ఇలా ఉంటే పల్లెల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బాధ్యత వహించి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version