కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది. మరణాలూ ఎక్కువగానే ఉన్నాయి. మే 1వ తేదీ నుండి లాక్డౌన్ ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కరోనాతో భారతదేశం పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఇండియాను సస్పెండ్ చేసాయి. ఇప్పటికే ఇటలీ, జర్మనీ, యూకే, బంగ్లాదేశ్ మొదలగు దేశాలు ఇండియా నుండి తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్నాయి.
ఆ లిస్టులో తాజాగా మాల్దీవ్స్ కూడా చేరింది. సినిమా సెలెబ్రిటీలు తరచూ వెళ్ళడం వల్ల ఈ అ పర్యాటక ప్రదేశం వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఐతే ఈ సారి మాత్రం ఇండియా నుండి పర్యాటకులను వద్దనుకుంటుంది. భారతదేశంలో కరోనా జోరు ఎక్కువగా ఉండడంతో మాల్దీవ్ పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు కఠిన క్వారంటైన్ నిబంధనలు పెట్టిన మాల్దీవ్స్, ఇప్పుడు పూర్తిగా ఇండియా పర్యాటకులనే వద్దనుకుంది. అటు దుబాయ్ కూడా వారం రోజుల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.