పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి – ఈటల

-

పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీసు కిష్టయ్యకు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ మల్లి దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నిప్పుంటిచ్చుకుంటే తొలి అమరుడు పోలీసు కిష్టయ్య అన్నారు. 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని… తెలంగాణ జాతి విముక్తి కోసం తన ప్రాణాలను అర్పించారని తెలిపారు.

అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించడం అంటే వారి ఆశయాలను కొనసాగించడమే. వారి ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాలు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇల్లు నిర్మించి ఇవ్వాలి, నెలవారి పెన్షన్ ఇవ్వాలని కోరారు.త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి… పోలీసు కిష్టన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి.
జయంతి వర్ధంతి ఉత్సవాలను గొప్పగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version