ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్రం కక్ష్య సాధిస్తోందని టీ కాంగ్రెస్ నేతలు సత్యగ్రహ దీక్షకు దిగారు. రాహుల్‌పై పార్లమెంట్‌లో అనర్హత వేటుతో అన్ని రాష్ట్రాల్లో సత్యాగ్రహ దీక్ష చేయాలని కాంగ్రెస్ ఏఐసీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యగ్రహ దీక్షకు దిగారు.
రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు ఉన్నారన్నారు. కాంగ్రెస్ వస్తేనే.. అదీ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం ఒక చిన్న తప్పుతో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేశారన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అగ్రనేతకు మద్దతుగా ఈ సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వెనుక, ఆయనకు సెక్యూరిటీని తీసివేయడం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు.