గత నెల రోజులుగా జరుగుతున్న తమిళనాడు స్థానిక ప్రీమియర్ లీగ్ చివరి రోజుకు చేరుకుంది. 8 జట్లతో ప్రారంభం అయిన ఈ టోర్నీ ఆఖరికి ఎండు జట్లు మాత్రమే మిగిలాయి. ఈ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రెండు జట్లు ఈ రోజు జరుగుతున్న ఫైనల్ కు చేరుకున్నాయి. అరుణ్ కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న నెల్లై రాయల్ కింగ్స్ జట్టు లీగ్ దశలో మంచి ఆటతీరును ప్రదర్శించి మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఇండియన్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ కాప్టెన్ గా ఉన్న లైకా కోవై కింగ్స్ సీజన్ ఆద్యంతం టాప్ పెర్ఫార్మన్స్ తో పాయింట్ల పట్టికలోనూ టాప్ లో నిలిచింది. ఈ రెండు జట్లు ఈ రోజు తిరునెల్వేలి గ్రౌండ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటగా టాస్ గెలిచిన కెప్టెన్ షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
TNPL 2023 ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ షారుఖ్ ఖాన్ … !
-