పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజయ్ ని చెప్పుతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ మాలోవత్ కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకోవాలి…. కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కి అక్కా చెల్లెలు లేరా ? బండి సంజయ్ ని… మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలన్నారు మాలోవత్ కవిత. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ ని బిజెపి నుంచి బహిష్కరించాలని కోరారు మాలోవత్ కవిత. ఇక అటు ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు..ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్‌ఎస్ నేతలు. కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.