కాాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న దీదీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే నరేంద్ర మోదీ శక్తివంతంగా తయారవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాను సీరియస్ గా తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోందని.. దానికి దేశం ఎందుకు బాధ పడాలని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీకి గతంలో అవకాశం వచ్చినా… బీజేపీపై పోరాడకుండా బెంగాల్లో నాపై పోటీ చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీని స్థాపించి, ఎవరి సహాయం లేకుండా మూడు సార్లు టీఎంసీని అధికారంలోకి తీసుకువచ్చామని ఆమె వెల్లడించింది.
కాంగ్రెస్ వైఫల్యాల వల్లే మోదీ శక్తివంతమవుతున్నారు.- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
-