స్కూటీ నడిపేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ.. అదుపు తప్పి

-

దేశంలో పెట్రోలు ధరలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేసింది. చమురు, ఇంధన ధరలు పెంపును నిరసిస్తూ నేడు భారత్ బంద్‌ను కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పశ్చిన బంగా సీఎం మమతా బెనర్జీ సైతం పెట్రోల్ ధరలు పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమె కొంచెం వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటీపై సచివాలయానికి వెళ్లారు. కోల్‌కతా మేయర్ స్కూటీ నడిపితే దీదీ వెనుక కూర్చొని వెళ్లారు.

Mamata Banerjee

అయితే సాయంత్రం సచివాలయం నుంచి వచ్చేటప్పుడు.. మమతా బెనర్జీ స్కూటీ నడిపే ప్రయత్నం చేశారు. దీదీకి స్కూటీ అంత పర్‌ఫెక్ట్‌గా రాదు. వ్యక్తిగత సహాయ సిబ్బంది స్కూటీని పట్టుకుని ఆమెకు నేర్పించే ప్రయత్నం చేశారు. బ్యాలెన్స్ అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై బండిని పట్టుకున్నారు. అనంతరం సిబ్బంది సహాయంతో మమతా బండిని నడిపారు. అనంతరం మేయర్ షిర్హద్ హకీం స్కూటీని నడిపి సీఎం మమతను వెనుక ఎక్కించుకున్నారు. ఇలా సచివాలయం నుంచి కాళీఘాట్ వరకూ ఆమె వెళ్లారు. పెట్రోల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ మెడలో ప్లకార్డు వేసుకుని 5 కి.మీ ప్రయాణించారు దీదీ. మోదీ ప్రభుత్వ తప్పుడు వాగ్ధానాల వల్లే ఇంధన రేట్లు పెరిగాయన్న ఆమె.. ప్రజా వ్యతిరేక పాలనతో మోదీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి మమతా స్కూటీ నడుపుతూ కింద పడబోయిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

పెరిగిన చమురు ధరలను నిరసిస్తూ నేడు వ్యాపార సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు మమతా సర్కారు పూర్తి మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా 40 లక్షలు వాహనాలు నిలిపివేస్తున్నట్లు సీఏఐటీ ప్రకటించింది. అయితే ఈ బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయి. బంద్ ప్రభావంతో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ఆదేశాలు జారి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version