హైదరాబాద్ నాంపల్లిలో అమానుషం చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ బాటిల్ దొంగిలించాడంటూ ఓ బాలుడి పట్ల షాపు యజమాని కృష్ణ దారుణంగా ప్రవర్తించాడు. బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లి చితక్కొట్టాడు. దుస్తులు తీసి కాళ్లు, చేతులు కట్టేసి కారం చల్లాడు. అనంతరం మళ్లీ కొడుతూ వీడియోలు చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు.
తర్వాత ఆ వీడియోలను తెలిసిన వారికి పంపడంతో చివరికి విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షాపు యజమాని కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.