గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి లిఫ్టు గుంతలో పడేసి దుండుగగులు వెళ్లిపోయారు.హైదరాబాద్ – హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ గుంతలో మృతదేహాన్ని సోమవారం ఉదయం పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది.కాగా, స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను తనిఖీలు చేసి నిందితులను జాడ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.క్లూస్ టీం ఆధారంగా దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.