ప్రియుడి ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ఏకంగా లింగమార్పిడి చేసుకున్నాడు. కానీ అతడికి ప్రియుడు షాక్ ఇచ్చాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. కోల్ కత్తాకు చెందిన జమాల్ షేక్ (31) అనే వ్యక్తి 16ఏళ్ల కిందట ముంబాయికి వచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఫుర్ ఖాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కాగా జమాల్ ఫుర్ ఖాన్ పై ప్రేమను పెంచుకున్నాడు. అనంతరం విషయాన్ని ఫుర్ ఖాన్ కు తెలిపాడు. దాంతో ఫుర్ ఖాన్ నువ్వు లింగ మార్పిడి చేసుకుంటే మనం కలిసి ఉండొచ్చని జమాల్ కు చెప్పాడు.
అతడి మాయమాటలు నమ్మి జమాల్ ఏకంగా లింగమార్పిడి చేయించుకున్నాడు. ఇక లింగ మార్పిడి చేసుకున్న తరవాత కొద్దిరోజులు భాగానే కలిసి ఉన్న ఫుర్ ఖాన్ ఆ తరవాత ముఖం చాటేశాడు. అంతే కాకుండా ముంబాయి నుండి ఢిల్లీకి పారిపోయాడు. దాంతో జమాల్ అలియాస్ శిల్ప తనను ప్రియుడు మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. తన వద్ద డబ్బులు తీసుకున్నాడని..కానీ చివరికి వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.