మనలో ఆహారం విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయి. మనలో కొందరు లావుగా కనిపించినా తక్కువ ఆహారమే తీసుకుంటూ ఉంటారు. మరికొందరు సన్నగా కనిపించినా కుంభాలకు కుంభాలు ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక యువకుడు మాత్రం ఒక హోటల్ లో వండిన ఆహారమంతా తినేశాడు. ఆ యువకుడు కేవలం గంట సమయంలోనే హోటల్ లో వండిన ఆహారాన్ని తినేయడం గమనార్హం.
రెండు మిల్క్ షేక్ లు, మూడు శాండ్ విచ్ లు, రెండు కప్పులు ఫ్రెంచ్ ఫ్రైస్, నాలుగు హాట్ డాగ్స్, ఎనిమిది బర్గర్లను గంటలోపే వేగంగా తినేశాడు. అయితే ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో అతను 400 పౌండ్ల విరాళాన్ని సంపాదించగలిగాడు. మన దేశ కరెన్సీ ప్రకారం 39,123 రూపాయలను తక్కువ్ సమయంలోనే కైల్ సంపాదించగలిగాడు. ఆహారం తిన్న వీ కైల్ యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గంట సమయంలో 13 వేల కేలరీల ఫుడ్ ను భుజించడం గమనార్హం.